Hero Akshay Kumar : 650 మంది స్టంట్ మెన్ ల‌కు భీమా భ‌రోసా

కల్పించిన బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్

Hello Telugu - Hero Akshay Kumar

Hello Telugu - Hero Akshay Kumar

Akshay Kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) సంచ‌ల‌నంగా మారారు. త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. 650 మంది స్టంట్ మెన్ ల‌కు స్వంత ఖ‌ర్చుల‌తో ఇన్సూరెన్స్ క‌ల్పించారు. స్టంట్ క‌ళాకారుల ప‌ట్ల త‌న ప్రేమ‌ను చాటుకున్నారు. వీరిలో స్టంట్ మెన్ లు, ఉమెన్ లు కూడా ఉన్నారు. వారంద‌రికీ భీమా సౌక‌ర్యం క‌ల్పించారు. సినిమా పూర్తి కావాలంటే ఇత‌ర క‌ళాకారుల పాత్ర కూడా ఎక్కువ‌గా ఉంటుంది. వీరు ప‌డుతున్న క‌ష్టం మామూలు కాదు. నిరంత‌రం దీనిపైనే ఫోక‌స్ పెడతారు. హీరోలతో స్టంట్ లు చేసేట‌ప్పుడు శ్ర‌మిస్తారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతారు.

Hero Akshay Kumar Helps

తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య న‌టిస్తున్న సినిమా షూటింగ్ లో ప్ర‌ముఖ స్టంట్ మెన్ చిత్రీక‌ర‌ణ సంద‌ర్బంగా కారు స్టంట్ లో భాగంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది. ఇదే కేసుకు సంబంధించి ద‌ర్శ‌కుడు పా రంజిత్ తో పాటు నిర్మాణ సంస్థ‌పై త‌మిళ‌నాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు. చాలా మంది సినిమాల‌లో హీరో హీరోయిన్ల‌ను మాత్ర‌మే చూస్తారు. కానీ దాని వెనుక వేలాది మంది క‌ళాకారుల శ్ర‌మ దాగి ఉంది.

ప్ర‌ధానంగా సినిమాల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో భ‌ద్ర‌త ప‌ట్ల ఎక్కువ‌గా ఫోక‌స్ ఉంటుంది. చాలా ఏళ్లుగా స్టంట్ మాస్ట‌ర్స్ హై రిస్క్ చేస్తున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రూపొందించే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేస్తున్న వీరికి భీమా సౌక‌ర్యం లేదు. ఇందులో కొంద‌రికి మాత్ర‌మే ఉండ‌డం తో ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా గుర్తించారు ముందుగా బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్. 650 మందికి త‌న స్వంత ఖ‌ర్చుల‌తో భీమా సౌక‌ర్యం క‌ల్పించారు.

Also Read : Sania Mirza – Tollywood Hero : టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా చెట్టాప‌ట్టాల్..?

Exit mobile version