నకిలీ ఫైర్ ఎన్ఓసీ కాలేజీల వివ‌రాలు ఇవిగో

52 కాలేజీలు నకిలీ ఎన్ఓసీ సమర్పించినట్టు గుర్తింపు.

hellotelugu-FakeFireIOC

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది ప‌లు కాలేజీలు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంతకాన్ని ఫోర్జ‌రీ చేసి న‌కిలీ ఫైర్ ఎన్ఓసీ లతో ఇంట‌ర్ బోర్డుకు స‌మ‌ర్పించ‌డం. ఈ విష‌యాన్ని హైడ్రా గుర్తించింది. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ స్టేష‌న్ లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆపై ఇంట‌ర్ బోర్డుకు లేఖ రాసింది. ఆ కాలేజీల గుర్తింపును త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని కోరింది. ఈ మేర‌కు నకిలీ ఎన్వోసీ సమర్పించిన కాలేజీల చిట్టా పోలీసులకు ఇచ్చింది హైడ్రా. ఫైర్ మాజీ డిజీ నాగిరెడ్డి సంతకాలు సైతం కాలేజీ యజమాన్యాలు ఫోర్జ‌రీ చేసిన‌ట్లు గుర్తించింది. హైడ్రా కమిషనర్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసినన‌ట్లు గుర్తించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇక హైడ్రా ఫిర్యాదు చేసిన ఫేక్ ఫైర్ ఎన్ఓసీ లు స‌మ‌ర్పించిన కాలేజీల జాబితాలు ఇక్క‌డ ఉన్నాయి.

బాబుల్ రెడ్డి జూనియర్ కాలేజ్ (ఎర్రగడ్డ‌), న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (టోలిచౌక్), అలీ శాంతినికేతన్ జూనియర్ కాలేజ్ (మెహదీపట్నం)..శ్రీ అక్షర జూనియర్ కాలేజ్ (ఎల్లారెడ్డిగూడెం )
అచీవర్ జూనియర్ కాలేజ్ కాలేజ్ (టోలి చౌక్), హిదాయ‌త్ జూనియర్ కాలేజ్ ( ఆసిఫ్ నగర్) , జునైద్ జూనియర్ కాలేజ్ (హుమాయనగర్), సెయింట్ ప్రాక్టిక్స్ ఆటిట్యూడ్ జూనియర్ కాలేజ్ (నల్లకుంట)..
ఫిడ్జి జూనియర్ కాలేజ్ (నారాయణగూడ). శ్రీ వాణి జూనియర్ కాలేజ్ (మలక్ పేట్ ) , ఎస్ వి జూనియర్ కాలేజ్ (చంపాపేట్ ), శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజ్ (సంతోష్ నగర్.). విజినరీ జూనియర్ కాలేజ్( శాలిబండ), ముషీరాబాద్ జూనియర్ కాలేజ్ (జమిస్తాన్పూర్). సరోజినీ నాయుడు జూనియర్ కాలేజ్( చిక్కడపల్లి ) ఉన్నాయి.

ఇక వీటితో పాటు వెజినరీ జూనియర్ కాలేజ్ (షాలిబండ). లైఫ్ లైన్ జూనియర్ కాలేజ్ (చార్మినార్ ), నానో జూనియర్ కాలేజ్ (పద్మ కాలనీ నల్లకుంట ), ఆధ్యా జూనియర్ కాలేజ్( దిల్ షుఖ్ న‌గ‌ర్ ) , హిదయ జూనియర్ కాలేజ్( సంతోష్ నగర్), Iacg సి జి వోకేషనల్ జూనియర్ కాలేజ్(మూసారాంబాగ్ ), శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ (సికింద్రాబాద్ ), సింధు జూనియర్ కాలేజ్ (మెహదీపట్నం ), మాస్టర్ జూనియర్ కాలేజ్ (యూసుఫ్ గూడా చెక్ పోస్ట్ ), ఎస్విపి శ్రీ వెంకటేశ్వర పద్మావతి జూనియర్ కాలేజ్ (బోరబండ ), సెంట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ (బేగంబజార్) ,విదేశా జూనియర్ కాలేజ్, తిరుమలగిరి శ్రీ మేధా జూనియర్ కాలేజ్ (అత్తాపూర్), క్స్లెన్సీ జూనియర్ కాలేజ్ (మదీనాగూడ‌) ఉన్నాయి.

వీటితో పాటు విశ్వ భారతి జూనియర్ కాలేజ్ (హైదర్ షాకోట్), వికాస్ జూనియర్ కాలేజ్( వనస్థలిపురం), శ్రీ తపస్య జూనియర్ కాలేజ్( బండ్లగూడ జాగిర్ ), జ్ఞాన దీపిక జూనియర్ కాలేజ్( మాదాపూర్) ,భార్గవ జూనియర్ కాలేజ్ (స‌రూర్ న‌గ‌ర్) ,విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ (యాప్రాల్ ), శ్రీ అభ్యాస జూనియర్ కాలేజ్ (అల్వాల్ ), సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్( ఈసీఐఎల్ ), ఎక్స్లెన్సీ జూనియర్ కాలేజ్ (పెట్ బషీరాబాద్), శ్రీ నారాయణ కామర్స్ (ఉప్పల్ ), ఎక్సలెన్సీ కాలేజ్( ద‌మ్మాయిగూడ‌) ,శ్రీ చైతన్య భారతి కాలేజ్ (షేర్ లింగంపల్లి ), ఇక్బాల్ జూనియర్ కాలేజ్( రాజేంద్రనగర్ ) ,కైట్స్ జూనియర్ కాలేజ్ (ఓల్డ్ బోయిన్పల్లి ), కెరియర్ పాయింట్ జూనియర్ కాలేజ్ (పెట్ బషీరాబాద్) ఉన్నాయి.

శ్రీ చైతన్య భారతి జూనియర్ కళాశాల ( చందానగర్ ), ఇక్బాలియా జూనియర్ కళాశాల ( అత్తాపూర్ ), భార్గవ జూనియర్ కళాశాల (సాగర్ రోడ్, బైరామల్‌గూడ, సరూర్‌నగర్) ,. శ్రీ మేధా జూనియర్ కళాశాల ( అత్తాపూర్ ) , ఎక్సలెన్సియా జూనియర్ కళాశాల( మాదినగూడ) , విశ్వభారతి జూనియర్ కళాశాల (హైదర్‌షాకోట్ ) , వికాస్ జూనియర్ కళాశాల (వనస్థలిపురం ), శ్రీ తపస్య జూనియర్ కళాశాల ( బండ్లగూడ జాగీర్ ), జ్ఞాన దీపిక జూనియర్ కళాశాల ( వైఎస్ఆర్ విగ్రహం దగ్గర, మాదాపూర్ ) ఉన్నాయి.

Exit mobile version