Telangana : హైదరాబాద్ : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టీజీఎ్ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు రైల్వే వంతెన కింద వరద నీటిలో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రెండు బస్సుల నుండి సుమారు 100 మంది ప్రయాణికులను రక్షించారు.
Telangana Rains Update
గంటసేపు కురిసిన భారీ వర్షం రోడ్లు నీట మునిగి పోవడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు మునిగి పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం కారణమని ప్రజలు ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలను తలపింప చేస్తున్నాయి. నీటి మట్టానికి మించి నీళ్లు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 10 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
అంతే కాకుండా హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని ప్లాస్టిక్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గిడ్డంగి నుండి దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. ఇది చుట్టుపక్కల నివాస ప్రాంతాలలోని ప్రజలను భయాందోళనకు గురిచేసింది.మంటలను అదుపు చేయడానికి మూడు అగ్నిమాపక దళాలను రంగంలోకి దించారు. అగ్నిప్రమాదానికి కారణం తెలియలేదు.
స్థానిక నివాసితుల ప్రకారం గిడ్డంగిని కొన్ని నెలల క్రితం మూసి వేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా వర్షాల కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇప్పటికే ఆయా జిల్లాలకు రూ. 10 కోట్ల చొప్పున సర్కార్ నిధులు మంజూరు చేసింది.
Also Read : Vizag Heavy Rains – Huge Loss : విశాఖను ముంచెత్తిన వాన..పిడుగుల దెబ్బ
