అమరావతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో చేనేత క్టస్లర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తూనే, మరోవైపు నేతన్నలకు 365 రోజులూ ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆప్కో ద్వారా చేస్తున్న చేనేత వస్త్రాలకు సంబంధించిన కొనుగోళ్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ చేనేత సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది. 2019-24 మధ్య నాటి ప్రభుత్వం ఆప్కో ద్వారా చేసిన కోనుగోళ్లకు సంబంధించి చెల్లింపులు ఏనాడూ సకాలంలో చేయలేదు. దీనివల్ల చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు పెరుగుతూ రాసాగాయి. దీనివల్ల చేనేత సంఘాలపై విపరీతమైన ఆర్థిక భారం పడసాగింది. చెల్లింపులు నిలిచి పోవడంతో నేతన్నలు కుటుంబాలు అర్థాకలితో అలమటించసాగాయి. నేతన్నల కష్టాలను సీఎం చంద్రబాబు నాయుడు, పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ తెలుసుకుని, అధికారంలోకి రాగానే, ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రాలకు తక్షణ చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. సకాలంలో కొనులు చేసిన వస్త్రాలకు చెల్లింపులు చేయడం ద్వారా చేనేత సంఘాలపై ఆర్థిక భారం పడకుండా ఉండడంతో పాటు నేతన్నలకు నిత్యం ఉపాధి లభించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తోంది. లివరీ చెల్లింపులు సైతం చేస్తూ, చేనేత సహకార సంఘాలకు ఆసరాగా ఉంటోంది. చేనేతలు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇందులో భాగంగా ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రాలకు ఏప్రిల్ 2024 నుంచి ఏ నెల కానెల చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. మొదటి ఏడాది చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో అధికారులు 18,03 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేశారు. ఇందుకు గానూ రూ.18.02 కోట్ల మేర చెల్లింపులు చేశారు. రెండో ఏడాదిలో కూడా పూర్తిస్థాయి చెల్లింపులు చేశారు. ఈ ఏడాది మార్చి వరకూ రూ.6.61 కోట్ల వస్త్రాలను చేనేత సంఘాల నుంచి కొనుగోలు చేయగా, పూర్తి స్థాయిలో ఆ సంఘాలకు చెల్లింపులు చేశారు. రెండేళ్లలో రూ.24.51 కోట్లను చెల్లించి, చేనేత సంఘాలపై ఆర్థిక భారం పడకుండా, నేతన్నలకు నిత్యం ఉపాధి ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
