Heavy Rains : అమరావతి : వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో వాయు గుండం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. రాబోయే రెండు రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు (Heavy Rains) వస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిమీ వేగంతో వాయుగుండం కదిలిందని దీని కారణంగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ముందస్తు జాగ్రత్తలు సూచించింది. ఇది ప్రస్తుతానికి పూరికి 60 కి.మీ. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70 కి.మీ, కళింగపట్నం(ఏపీ)కి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది .
Heavy Rains in AP Sensational
గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలను వాయుగుండం నెలకొందని పేర్కొన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదిలా ఉండగా గోదావరి, కృష్ణా నదులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి.
రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Also Read : Jajula Srinivas Goud Important Update : బీసీ రిజర్వేషన్ల పెంపు బీసీల పోరాట విజయం
















