Heavy Rains : అమరావతి – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలోని ప్రాజెక్టులన్నీ కళ కళ లాడుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ప్రభుత్వం. గోదావరి నదిపై రెండవ వరద హెచ్చరిక జారీ చేశారు. ప్రధానంగా గోదావరి, కృష్ణ నదులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు జిల్లాలు అలర్ట్ అయ్యాయి. అధికారులు అవసరాన్ని బట్టి ప్రజలను సహాయ కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు శుక్రవారం తెల్లవారు జామున నీటి మట్టం 13.75 అడుగులకు చేరుకుంది. దీంతో 13 లక్షల క్యూసెక్కులకు పైగా సముద్రంలోకి నీటిని విడుదల చేశారు.
Heavy Rains in Godavari
గోదావరి (Godavari), కృష్ణా నదులే కాకుండా పెన్నా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద గోదావరిపై రెండవ వరద హెచ్చరిక జారీ చేయడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రాత్రి 9 గంటలకు, బ్యారేజీ వద్ద నీటి మట్టం 11.98 లక్షల క్యూసెక్కులు ఉండగా అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ సాయంత్రం 5 గంటలకు నీటి మట్టం 52.10 అడుగులకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో వరద పరిస్థితి కొంచెం ఉపశమనం లభించింది, ఉదయం 5 లక్షల క్యూసెక్కులకు పైగా సముద్రంలోకి విడుదల చేయడంతో నీటి మట్టం తగ్గడం ప్రారంభమైంది. రాత్రి 9 గంటలకు, పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లోలు నాలుగు లక్షల క్యూసెక్కులను తాకడంతో నీటి మట్టం 4.80 లక్షల క్యూసెక్కుల విడుదలైంది.
Also Read : IBM Quantum Computers Interesting : అమరావతికి ఐబీఎం క్వాంటం కంప్యూటర్
