HCL CEO : ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ వేతనం దేశంలోని టెక్నాలజీ సంస్థల ముఖ్యాధికారుల్లో అత్యధికంగా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆయన వేతనం రూ.94.6 కోట్లు (అంటే సుమారు 1.085 మిలియన్ డాలర్లు)గా నమోదైంది. ఇది టీసీఎస్ సీఈఓ కృతివాసన్ (రూ.26.52 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ (రూ.80.62 కోట్లు), విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా (రూ.53.64 కోట్లు), టెక్ మహీంద్రా సీఈఓ మొహిత్ జోషి (రూ.53.9 కోట్లు) వేతనాలతో పోల్చితే అధికంగా ఉంది.
HCL CEO Salary Updates
విజయ్ కుమార్ (Vijay Kumar) వేతనంలో మూల వేతనం 19.6 లక్షల డాలర్లు కాగా, పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (బోనస్) 17.3 లక్షల డాలర్లుగా హెచ్‌సీఎల్ టెక్ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆయన వేతనాన్ని సుమారు రూ.154 కోట్లు (అంటే 1.86 మిలియన్ డాలర్లు)కు పెంచేందుకు సంస్థ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది.
విజయ్ కుమార్ 2016లో హెచ్‌సీఎల్ టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ మార్కెట్ విలువ ₹1.15 లక్షల కోట్ల నుంచి ₹4.32 లక్షల కోట్లకు చేరింది. అంటే 3.8 రెట్ల వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో టాప్ ఐటీ కంపెనీల వృద్ధి సగటున 2.5 రెట్లు మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో విజయ్ కుమార్‌కు గణనీయమైన వేతన పెంపు జరగడం గమనార్హం. భారతీయ ఐటీ రంగంలో ఆయన నాయకత్వాన్ని కంపెనీ ఫలితాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
Also Read : Bullet Train – India Growth : దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై లో..8 గంటల ప్రయాణం 2 గంటల్లో


















