Sleep : ప్రతి రోజు పడకకు వెళ్లే ముందు కొన్ని సరళమైన, మంచి అలవాట్లు అలవరచుకుంటే నిద్ర సరిగ్గా పడుతుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి పొందే అవకాశం లభిస్తుంది. నిద్ర నాణ్యంగా ఉండటం వలన మన ఆరోగ్యం మెరుగవుతుంది. రోజంతా శక్తిగా, ఉత్సాహంగా ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అయితే, కొన్ని అలవాట్లు నిద్రపై (Sleep) ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Sleep – నిద్రకు ముందు డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించండి
పెద్ద ఎత్తున ప్రజలు పడకకు వెళ్లే ముందు మొబైల్ ఫోన్‌లు, టీవీలు, లాప్‌టాప్‌లు వాడుతున్నారు. ఇది నిద్రలేమికి (Sleep) ప్రధాన కారణం అవుతోంది. నిపుణుల ప్రకారం, పడుకునే ముందు స్క్రీన్ టైమ్ తగ్గించడం అవసరం. ఫోన్ నుంచి వెలువడే నీలి కాంతి మెదడును ఉత్తేజపరిచి నిద్రను దెబ్బతీస్తుంది. అందుకే, నిద్రకు కనీసం అరగంట ముందు మొబైల్, టీవీ వాడకాన్ని నిలిపివేయాలని సూచిస్తున్నారు.
మద్యం, ధూమపానం దూరంగా ఉంచాలి
రాత్రివేళ మద్యం సేవించడం, ధూమపానం చేయడం కొంతమేరకు నిద్ర తీసుకొస్తేను, ఆ నిద్ర సకాలంలో అంతరాయం కలిగిస్తుంది. మత్తు తగ్గిన తర్వాత మెలకువ రావడం వల్ల నిద్ర పూర్తిగా పడకపోవచ్చు. దీని వల్ల శరీరానికి కావలసిన విశ్రాంతి దక్కదు.
సరైన ఆహారంతో మంచి నిద్ర
పడకకు ముందు తేలికపాటి, సమతుల్య ఆహారం తీసుకోవడం మేలైనది. గోధుమ పాస్తా, ఓట్‌మీల్, పాల పదార్థాలు, హెర్బల్ టీ వంటి ఆహారాలు శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తాయి. అయితే టీ, కాఫీ వంటి కాఫైన్ ఉన్న పానీయాలు మానుకోవాలి. ఇవి నిద్రను దెబ్బతీయే అవకాశముంది.
గది వాతావరణం ఎంతో కీలకం
నిద్రకు అనుకూలమైన గది వాతావరణం ఉండటం అవసరం. గది తాలూకు ఉష్ణోగ్రత ఎక్కువగానీ, తక్కువగానీ ఉండకూడదు. అలాగే, శబ్దరహితంగా ఉండాలి. వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే శరీరం త్వరగా నిద్ర మూడ్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
సరైన పరుపు, దిండ్లతో సౌకర్యవంతమైన నిద్ర
మంచి నిద్రకు అనువైన పరుపు, దిండు కూడా ముఖ్యం. అధిక కఠినత కలిగిన లేదా బాగా ఒరిగిపోయిన పరుపు నిద్రలో అంతరాయం కలిగించవచ్చు. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మెత్తని కానీ మద్దతు ఇచ్చే పరుపు ఎంచుకోవడం ఉత్తమం.
Also Read : Toll Tax Free : ఆ వాహనాలకు నో టోల్ ట్యాక్స్ అంటున్న మరాఠా సర్కార్
