Popular Director Harish Shankar : ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై దృష్టి సారించా

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ప్ర‌క‌ట‌న

Hello Telugu - Hello Telugu - Popular Director Harish Shankar

Hello Telugu - Hello Telugu - Popular Director Harish Shankar

Harish Shankar : త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించాడు ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్ (Harish Shankar). త‌ను ప్ర‌స్తుతం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తీస్తున్నాడు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ వ‌వ‌న్ క‌ళ్యాణ్ , శ్రీ‌లీల‌, రాశీ ఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఫుల్ బిజీగా ఉన్నాడు ద‌ర్శ‌కుడు. త‌ను ఫుల్ ఫోక‌స్ పెట్టాడు మూవీ పూర్తి చేయ‌డంపై. త‌దుప‌రి ప్రాజెక్టు గురించి ఆలోచించ‌డం లేద‌న్నాడు. త‌న దృష్టి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తోనే ఉంటుంద‌న్నాడు. కొంద‌రు కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేస్తున్నారంటూ వాపోయాడు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటూ హిత‌వు ప‌లికాడు. ఇదిలా ఉండ‌గా ర‌వితేజ‌, భాగ్య‌శ్రీ తో క‌లిసి తాను తీసిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దీంతో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి త‌ను తీస్తున్న మూవీపై.

Director Harish Shankar Focus on Ustaad Bhagat Singh

ఈ ఏడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన మేర ఆడ‌లేదు. దీనిని భారీ బ‌డ్జెట్ తో తీశాడు నిర్మాత ఎంఎం ర‌త్నం. దీనిని మొద‌ట‌గా ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్ తీశాడు. మ‌ధ్య‌లోనే ఆగి పోయాడు. ఆ త‌ర్వాత నిర్మాత సోద‌రుడి త‌న‌యుడు జ్యోతికృష్ణ‌కు అప్ప‌గించాడు. అంతాగా ఆక‌ట్టుకునేలా తీయ‌లేక పోయాడు. ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. అయితే ఇంకో సినిమా పూర్త‌యింది. అదే సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఓజీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌రో వైపు హ‌రీష్ శంక‌ర్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను ఎలాగో పూర్తి చేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బిగ్ స‌క్సెస్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడు.

Also Read : Rajinikanth Coolie Sensational : రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తున్న తలైవా కూలీ

Exit mobile version