Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘కూలీ’ (Coolie) సినిమా విడుదలకు ముందే అనూహ్యమైన స్థాయిలో విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూపొందించిన ఈ భారీ చిత్రం ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్‌లో 250 కోట్ల రూపాయలు వసూలు చేసి సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Coolie Movie Updates
ఈ చిత్రం మొత్తం రూ.375 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడినట్టు సమాచారం. ఇప్పటివరకు జరిగిన ఇంటర్‌నేషనల్, డిజిటల్, మ్యూజిక్ మరియు శాటిలైట్ హక్కుల అమ్మకాల ద్వారా సినిమా బడ్జెట్‌లో సుమారు 66 శాతం వసూలైంది. ముఖ్యంగా ఇంటర్‌నేషనల్ హక్కులు మాత్రమే రూ.60 కోట్లు పొందినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ హవా
సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కూలీ మరో ఘనతను నమోదు చేసుకుంది. విదేశాల్లో మాత్రమే రూ.30 కోట్ల రూపాయల అడ్వాన్స్ టికెట్ అమ్మకాలతో ఈ చిత్రం పటిష్టమైన మార్కెట్‌ను చాటింది.
కేరళలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ Craze నెలకొంది. అక్కడ థియేటర్ల వద్ద బుకింగ్స్ కోసం ప్రేక్షకులు పరుగులు తీయడం, క్యూ కట్టడం వంటి దృశ్యాలు కనిపించాయి. శుక్రవారం, త్రిస్సూర్‌లోని ఒక థియేటర్ వద్ద అభిమానుల గుమిగూడిన దృశ్యాల వీడియోను సన్ పిక్చర్స్ విడుదల చేసింది.
భారీ తారాగణంతో కూడిన సినిమా
ఈ చిత్రంలో రజనీకాంత్‌కు పోటిగా నటుడు కింగ్ నాగార్జున ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
విడుదల తేదీ
‘కూలీ’ సినిమా ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రీబజ్, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ వంటి అంశాల దృష్ట్యా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద రికార్డులు నమోదు చేయనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : Hero Mahesh Babu : భారీగా పెరిగిన ‘ప్రిన్స్’ నికర ఆస్తుల విలువ
