YS Sharmila : విజయవాడ – చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు..అన్నదాత దుఃఖీభవ అంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీల అర్హులు అందరికి కాదని కేవలం కొందరికేనని అన్నారు. శుక్రవారం షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులు మాత్రమేనని మరి మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సగం మందికే ఇస్తున్నారని, తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు కోత పెట్టారని మండిపడ్డారు.
YS Sharmila Slams CM Chandrababu Ruling
ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20 వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో బాబు ఊదర గొట్టారంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. తీరా గెలిచాక కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో ముడిపెట్టి నాలుక మడతేశారంటూ మండిపడ్డారు.కేంద్రం ఇచ్చే రూ.6 వేలు పక్కన పెడితే రాష్ట్ర నిధుల నుంచి మీరిచ్చేది కేవలం రైతుకి రూ.14 వేలేనని అన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారని గుర్తు చేశారు.
కేంద్రం నేరుగా రైతుల అకౌంట్ లో వేస్తున్నప్పుడు మీరెలా ఇచ్చినట్లు చెప్పుకుంటారు అన్నారని ప్రశ్నించారు. మీరిస్తామని చెప్పిన రూ.20 వేలకు కేంద్రం వాటాను ఎందుకు జోడించారని నిలదీశారు.
Also Read : Ex Minister Anil Kumar Yadav Fired on NDA Govt : సిట్టింగ్ జడ్జితో విచారణ చేసే దమ్ముందా..?
