Harish Rao Fired on Telangana Govt : స‌ర్కార్ నిర్ల‌క్ష్యం ప‌త్తి రైతుల‌కు శాపం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Fired on Telangana Govt

Hello Telugu - Harish Rao Fired on Telangana Govt

Harish Rao : వ‌రంగ‌ల్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ప‌త్తి రైతులు తాము పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రాక అల్లాడి పోతున్నార‌ని బాధ్య‌త క‌లిగిన స‌ర్కార్ మాత్రం చోద్యం చూస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao). కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కావాల‌ని క‌క్ష క‌ట్టాయ‌ని వాపోయారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌త్తి రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. వారి గోడు విన్నారు హ‌రీశ్ రావు. సీసీఐ కొనుగోలు నిలిపి వేయడం ప‌ట్ల మండిపడ్డారు. ఆరుగాలం పండించిన పంట అమ్ముకునే దిక్కులేక తల్లడిల్లుతున్న పత్తి రైతులను ఆదుకోవాల్సిన సీఎం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Harish Rao Slams Telangana Govt

వరంగల్ ఏనమాముల మార్కెట్లో మొక్కజొన్న, పత్తి రైతులను హరీష్ రావు, శాసన మండలి సభాపక్ష నాయకులు మధుసూదన చారి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ లు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వ బృందంతో కలిసి ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌త్తి రైతుల‌ను ఆదుకునేంత వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించారు. కావాల‌ని క‌క్ష క‌ట్టి అన్న‌దాత‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం దారుణ‌మన్నారు.

Also Read : Prashant Kishor Shocking Comments on Bihar : బీహార్ ఎన్నిక‌ల‌పై ప్ర‌శాంత్ కిషోర్ కామెంట్స్

Exit mobile version