Harish Rao Fired on Congress Govt : ప్ర‌భుత్వ భూముల‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెడితే ఎలా..?

కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగిన హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Fired on Congress Govt

Hello Telugu - Harish Rao Fired on Congress Govt

Harish Rao : హైద‌రాబాద్ : అత్యంత విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను అప్ప‌నంగా త‌క్కువ ధ‌ర‌కే అప్ప‌గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు (Harish Rao). ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎవ‌రికి భూములు కేటాయించినా 200 శాతం ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌చ్చేలా ధ‌ర నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేవ‌లం త‌న అనుయాయుల‌కు, త‌న త‌మ్ముళ్ల‌కు క‌ట్ట‌బెట్టేందుకు లోపాయికారీగా ఒప్పందాలు చేసుకునే ప‌నిలో సీఎం బిజీగా ఉన్నాడ‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్బంగా ఆయా ప్రాంతాల‌లో ఎలా త‌క్కువ ధ‌ర‌కు క‌ట్ట‌బెడుతున్నార‌నే దానిపై ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టారు.

Harish Rao Slams Congress Govt

మల్లాపూర్‌లో 240 ఎకరాల భూమి ఉంద‌ని టీజీఐఐసీ ప్రకారం ధ‌ఱ రూ.36,827 ఉండగా ఎస్ఆర్ఓ ధర ప్రకారం కేవలం రూ.17,581 మాత్రమే ఎందుకు కట్టబెడుతున్నారని స‌ర్కార్ ను నిల‌దీశారు హ‌రీశ్ రావు.
ఇక ఉప్పల్ లో 447 ఎకరాల భూమి టీజీఐఐసీ ప్రకారం రూ.52,523 ఉండగా సబ్ రిజిస్ట్రేషన్ విలువ రూ.21,886 లో కూడా 30 శాతానికి ఎందుకు అమ్ముతున్నారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. గాంధీనగర్ లో ఉన్న భూములు టీజీఐఐసీ ప్రకారం రూ.46,895 ఉండగా, సబ్ రిజిస్ట్రేషన్ విలువ రూ.14,591 కే అమ్ముతున్నారంటూ ఆరోపించారు. హయ‌త్ న‌గ‌ర్ లో భూములకు TGIIC ప్రకారం రూ.54,340 ఉండగా, సబ్ రిజిస్ట్రేషన్ విలువ రూ.14,591 కే అమ్ముతుండ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : Byju Raveendran Shocking : బైజూ రవీంద్రన్‌కు షాక్ రూ. 9 వేల కోట్ల జ‌రిమానా

Exit mobile version