Harish Rao : హైదరాబాద్ – తెలంగాణ అంటే సీఎం రేవంత్ రెడ్డికి పడదన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ప్రస్తుతం ఆయన చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. శనివారం
ఉప్పల్‌లో జరుగుతున్న బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్ట్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి. జై ఢిల్లీ, జై సోనియా, జై మోదీ అంటూ కాలం వెళ్లదీస్తున్నాడని ఆరోపించారు. పొద్దున లేసి నప్పటి నుంచి పడుకునేంత వరకు కేసీఆర్ ను తిట్టి పోయడం తప్ప చేస్తున్నది ఏమీ లేదన్నారు.
MLA Harish Rao Slams CM Revanth Reddy
ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారి పోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు హరీశ్ రావు (Harish Rao). ప్రజలు తిరగబడితే జిరాక్స్ కాపీ స్పీకర్‌కు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమకారులపై తుపాకీ పెట్టి రైఫిల్ రెడ్డిగా మిగిలాడన్నారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే బాబు పేరు మొదలు, రెండోది రేవంత్ రెడ్డి పేరు రాయాల్సి ఉంటుందన్నారు. సింహాలు చరిత్ర చెప్పనంత కాలం, వేటగాడు చెప్పిందే కథ అన్నట్లు ఉంటదన్నారు. కేసీఆర్ పోరాటం, ఉద్యమం చరిత్రగా చెప్పాలి. లేదంటే అస్థిత్వంపై దెబ్బ పడుతుందన్నారు హరీశ్ రావు. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
రేవంత్ రెడ్డి వచ్చాక పుస్తకాల్లో కేసీఆర్ పేరు తొలగించాడని, తెలంగాణ తల్లి విగ్రహం మార్చాడని, బతుకమ్మ తొలగించాడని, అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు దండ వేసిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ పోరాటం, ఉద్యమం చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఏ పోరాటం అయినా యువతతోనే ప్రారంభమవుతుందని చెప్పారు హరీశ్ రావు. 1969 ఉద్యమం, మలిదశ ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో యువత పాత్ర కీలకంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఎంతోమంది యువతను కేసీఆర్ తెచ్చారన్నారు. యువత నుండే నాయకత్వం పుడుతుందన్నారు.
Also Read : AP DGP Exclusive – Maoist Couple : సీనియర్ మావోయిస్టు దంపతులు సరెండర్
