Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) సీరియస్ అయ్యారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ప్రతిపక్షాల నేతలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అధికారం అన్నది శాశ్వతం కాదని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రధానంగా తమ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాలని అక్రమ కేసులు బనాయించేలా ఒత్తిడి తీసుకు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం అన్నారు తన్నీరు హరీశ్ రావు.
Harish Rao Slams CM Revanth Reddy
పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కార్ అంటూ ధ్వజమెత్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండ గడతూ వస్తున్న తమ నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చూడడం ప్రజలు తట్టుకోలేరని అన్నారు. కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అక్రమ కేసులతో బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరన్నారు హరీశ్ రావు.
Also Read : TFCC Chief Important Update on Varanasi Title : త్వరలోనే వారణాసి టైటిల్ వివాదానికి పరిష్కారం..?
