TFCC Chief Important Update on Varanasi Title : త్వ‌ర‌లోనే వారణాసి టైటిల్ వివాదానికి ప‌రిష్కారం..?

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు

Hello Telugu - TFCC Chief Important Update on Varanasi Title

Hello Telugu - TFCC Chief Important Update on Varanasi Title

TFCC Chief : హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఎస్ఎస్ఎంబీ29 వార‌ణాసికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా టైటిల్ ను ప్ర‌క‌టించిన త‌ర్వాత పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. దీనిపై స్పందించారు తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు (TFCC Chief) భ‌ర‌త్ భూష‌ణ్. వార‌ణాసి టైటిల్ వివాదం సామ‌ర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్కారం అవుతుంద‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ వివాదానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే ప‌రిష్కారం అవుతుంద‌న్నారు. ఇందులో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

TFCC Chief Key Update on Varanasi Movie Title

కాగా వార‌ణాసి టైటిల్ సీహెచ్ సుబ్బారెడ్డి నేతృత్వంలోని రామ బ్ర‌హ్మ హ‌నుమ క్రియేష‌న్స్ ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ చేసి పెట్టుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఈ విష‌యాన్ని తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కు ఫిర్యాదు చేసేంత దాకా వెళ్లింది. నిర్మాత మండలిలో రెండు సంవత్స‌రాల కింద‌టే రిజిష్ట‌ర్ అయి ఉంది. 2023 దాకా అదే నిర్మాణ సంస్థ పేరు మీదే ఉంది. ఇదే స‌మ‌యంలో స‌ద‌రు టైటిల్ ఈ ఏడాది జూన్ 24 దాకా పొడిగించారు. చివ‌ర‌కు ఇటీవ‌లే వ‌చ్చే ఏడాది 2026 జూలై 23 వ‌ర‌కు పొడిగించిన‌ట్లు తేలిపారు. ఈ టైటిల్ ఉప‌యోగించ‌డం చ‌ట్ట రీత్యా నేరం. దీనిపై ఇంకా క్లారిటి ఇవ్వ‌లేదు ఇటు రాజ‌మౌళి కానీ అటు నిర్మాత సుబ్బారెడ్డి కానీ.

Also Read : Telangana EC Approved : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ఈసీ సిద్దం

Exit mobile version