CM Revanth Reddy Challenge :సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ కు హ‌రీశ్ రావు సై

బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు ఎక్క‌డికైనా వ‌స్తా

Hello Telugu - CM Revanth Reddy Challenge

Hello Telugu - CM Revanth Reddy Challenge

CM Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు వివాదం రోజు రోజుకు మ‌రింత ముదిరేలా ఉంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించేలా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఏపీకి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, దీనిని నాలుగున్నర కోట్ల ప్ర‌జానీకం క్ష‌మించ‌ద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా హ‌రీశ్ రావు త‌న గురించి చేసిన కామెంట్స్ పై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ద‌మ్ముంటే త‌న‌తో బ‌హిరంగ చ‌ర్చ‌కు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై రావాల‌ని స‌వాల్ విసిరారు.

CM Revanth Reddy Challenge Accepted BRS MLA Harish Rao

దీనిపై హ‌రీశ్ రావు కీల‌క కామెంట్స్ చేశారు. తాను పూర్తి ఆధారాల‌తో వ‌స్తాన‌ని , డేట్, టైమ్ ఫిక్స్ చేస్తే ఎక్క‌డికి ర‌మ్మ‌న్నా అక్క‌డికి వ‌చ్చేందుకు రెడీగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది. తాను సభా నాయకుడిగా ఉన్నప్పటికీ, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని డిమాండ్ చేయాలని ప్రతిపక్ష నాయకుడైన మాజీ సీఎం కేసీఆర్ ను కోరినందుకు ముఖ్యమంత్రిని హరీష్ రావు ఎగతాళి చేశారు.

రేవంత్ రెడ్డి పూర్తిగా అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఆయ‌న పాల‌న పరంగా వైఫ‌ల్యం చెందాడ‌ని, దానిని క‌ప్పి పుచ్చుకునేందుకే త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నాడంటూ హ‌రీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఎవ‌రి ప్రయోజ‌నాల కోసం రాష్ట్రాన్ని, నీళ్ల‌ను తాక‌ట్టు పెట్టాల‌ని అనుకుంటున్నావో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. సీఎంకు ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాల‌ని తాను కూడా స‌వాల్ విసురుతున్నాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : 5G Smartphone Users Sensational : 30 కోట్లు దాటిన 5జీ వినియోగ‌దారులు

Exit mobile version