టీమిండియాకు ఇచ్చిన ప్రైజ్ మ‌నీ త‌క్కువే

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హ‌ర్భ‌జ‌న్ సింగ్

hellotelugu-HarbhajanSingh

న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విశ్వ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జ‌ట్టు విజ‌యం సాధించినందుకు గాను రూ. 131 కోట్ల న‌గ‌దు బ‌హ‌మ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీనిపై తీవ్రంగా స్పందించాడు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య స‌భ స‌భ్యుడు, భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ , స్పీన్న‌ర్ హ‌ర్భ జ‌న్ సింగ్. బీసీసీఐ ప్ర‌క‌టించిన ఈ న‌గ‌దు చాలా త‌క్కువ‌ని అన్నాడు. ఇంకా పెంచాల్సింది ఉండేద‌న్నాడు. భార‌త జ‌ట్టు అద్భుతం చేసింద‌న్నాడు. చ‌రిత్ర‌ను తిర‌గ రాసింద‌ని, ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సింది ఒకే ఒక్క‌డు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ అని ప్ర‌శంస‌లు కురిపించాడు.

త‌న ఆట గురించి చెప్పేందుకు త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌న్నాడు. న్యూఢిల్లీలో పార్ల‌మెంట్ స‌మావేశాల అనంత‌రం హ‌ర్బ‌జ‌న్ సింగ్ మీడియాతో మాట్లాడాడు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని విజ‌యం అని అన్నాడు భజ్జీ. రూ. 131 కోట్లు స‌రిపోవు. వారు అంత‌కు మించి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా హ‌ర్భ‌జ‌న్ సింగ్ చేసిన కామెంట్స్ క్రీడా వ‌ర్గాల‌లో వైర‌ల్ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా కొన‌సాగుతోంది. ఇదే స‌మ‌యంలో ప్రపంచ కప్‌లో ఆధిపత్యం చెలాయించినందుకు , భారతదేశం ఎంత శక్తివంతమైనదో అందరికీ చూపించినందుకు జట్టుకు అభినందనలు అని చెప్పాడు. (Photo Credit ANI)

Exit mobile version