Sanju Samson : హైదరాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) పుట్టిన రోజు ఇవాళ. నవంబర్ 11న తను ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. భారతీయ క్రికెట్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. భారత జట్టు సాధించిన విజయాలలో కీలకమైన పాత్ర పోషించాడు. టి20 ఫార్మాట్ లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇండియన్ క్రికెట్ ఫార్మాట్ లో అలవోకగా సిక్స్ లు , ఫోర్లు సాధించడంలో తను ప్రసిద్ది పొందాడు. కేరళ జట్టుకు దేశివాళిలో ప్రాతినిధ్యం వహించాడు. ఇండియా జట్టు తరపున వన్డే, టి20 ఫార్మాట్ లో ప్రస్తుతం ఆడుతున్నాడు. అంతే కాకుండా ప్రపంచంలోనే జనాదరణ పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
Sanju Samson Birthday Updates
సంజూ శాంసన్ కుడిచేతి వాటం కలిగిన వికెట్-కీపర్-బ్యాటర్. 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత అండర్-19 జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. 2015 లో జింబాబ్వేతో జరిగిన అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు, 2021లో శ్రీలంకపై వన్డే అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశాడు. ఢిల్లీలో తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు సంజూ శాంసన్. అక్కడి నుండి కేరళకు వెళ్లాడు. 2011లో కేరళ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున తన ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకున్నాడు. 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో అజేయంగా 212 పరుగులు చేసాడు, లిస్ట్ ఎ క్రికెట్‌లో ఆరోసారి డబుల్ సెంచరీ చేశాడు, ఇది ఫార్మాట్‌లో రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీగా నమోదయింది. తను నవంబర్ 11, 1994లో తిరువనంతపురం జిల్లా లోని పుల్లువిలాలో పుట్టాడు. తండ్రి కానిస్టేబుల్.
Also Read : MP Mahua Moitra Fired on Amit Shah : అమిత్ షా పై భగ్గుమన్న మహూవా మొయత్రా
