హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు , పాన్ ఇండియా అంతటా ఐకాన్ స్టార్ గా పిలుచుకునే అల్లు అర్జున్ అలియాస్ బన్నీ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తూ గ్రీటింగ్స్ వెల్లువెత్తాయి. ఇందులో తన తండ్రి అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ, నటుడు కొణిదల నాగబాబుతో పాటు ఇతర సినీ ప్రముఖులు సైతం విశెష్ తెలిపారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ , వీవీ వినాయక్, కె. రాఘవేందర్ రావు, సుకుమార్ , అట్లీ సైతం కంగ్రాట్స్ తెలిపారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం బన్నీ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న ఈ నటుడిని ఒక్కసారి చూడటానికి, అర్ధరాత్రి వేలాది మంది అభిమానులు ఆయన నివాసం వెలుపల గుమిగూడారు. ఆయన సోదరుడు, అల్లు శిరీష్, ఈ ప్రేమను పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పోస్ట్ చేశారు. ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండాలి. అసాధారణమైన నటనతో ఆకట్టు కోవాలని పేర్కొన్నాడు. తను నటించిన రేసు గుర్రం మూవీని తిరిగి తన పుట్టిన రోజు సందర్బంగా ఇవాళ రీ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ చివరిగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో కనిపించారు. ఇక ముందు, అతని తదుపరి ప్రాజెక్ట్ కోసం ఉత్సాహం పెరుగుతోంది. దీనికి తాత్కాలికంగా AA26 అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
