Stock Market : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల ఫీజును అమాంతంగా పెంచిన నిర్ణయం భారత ఐటీ రంగంపై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి.
Stock Market – సెన్సెక్స్, నిఫ్టీ కదలికలు
- గత శుక్రవారం ముగింపు 82,626తో పోలిస్తే సెన్సెక్స్ సోమవారం దాదాపు 500 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది.
- ట్రేడింగ్ సెషన్ మొత్తం 81,997 – 82,583 మధ్యలో కదలాడింది.
- చివరకు 466 పాయింట్లు నష్టపోయి 82,159 వద్ద రోజును ముగించింది.
- నిఫ్టీ కూడా అదే దారిలో నడిచి 124 పాయింట్లు కోల్పోయి 25,202 వద్ద స్థిరపడింది.
లాభాలు, నష్టాలు
- లాభాల్లో: అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ, హడ్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్బీసీసీ.
- నష్టాల్లో: ఎంఫసిస్, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, కోఫోర్జ్, పెర్సిస్టెంట్, సయింట్.
ఇతర సూచీలు
- నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్: 394 పాయింట్లు నష్టపోయింది.
- బ్యాంక్ నిఫ్టీ: 174 పాయింట్లు తగ్గింది.
- రూపాయి మారకం విలువ: డాలర్‌తో పోలిస్తే 88.31 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదిలినా, హెచ్-1బీ వీసా షాక్‌తో ఐటీ షేర్లు వెనక్కి లాగి దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి.
Also Read : Andaman Sea Oil Interesting : అండమాన్ సముద్ర భాగంలో భారీ చమురు నిక్షేపాలు
