JCC : చెన్నై : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సూచనల మేరకు కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ). ఏడాదిలో ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితి. నిత్యం వర్షాలతోనే గడపాల్సి వస్తోంది చెన్నైవాసులు. దీనిని గుర్తించింది జీసీసీ. ఈ మేరకు వరదల్లో చిక్కుకునే వారిని, బాధితులను రక్షించేందుకు స్వచ్చందంగా సేవలు అందించేందుకు వాలంటీర్లను తయారు చేయాలని యోచించింది. ఈ మేరకు 7,500 మంది వాలంటీర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈశాన్య రుతు పవనాల సమయంలో నివాసితులను మొదటి స్పందనదారులుగా సిద్ధం చేయడానికి నగరం అంతటా వరద రక్షణ శిక్షణా కార్యక్రమాల శ్రేణిని నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
CM MK Stalin Key Comments on JCC
నివాసి సంక్షేమ సంఘాలతో పాటు స్థానిక సంఘాల నుండి తీసుకున్న వారికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది జీసీసీ (JCC). ఈ సెషన్లలో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయడానికి పడవలు, తాళ్లు , ప్రాథమిక రెస్క్యూ పరికరాలను ఉపయోగించడంపై వారికి ఫుల్ శిక్షణ ఇస్తుంది. నివాసితులను సహాయ శిబిరాలు లేదా ఆసుపత్రులకు తరలించడంలో సహాయం చేయడానికి స్వచ్చంధ సేవకులు ఉపయోగగపడతారు. వీరిని అలా తీర్చిదిద్దడంలో జీసీసీ ఫోకస్ సారించింది. అత్యవసర సమయాల్లో అధికారులతో సమన్వయం చేసుకోవడంపై మార్గ నిర్దేశం చేసే ప్రయత్నం చేస్తోంది.
Also Read : YSRCP Fired on AP Govt : కనీస మద్దతు ధర రాక రైతన్నల గోస















