చీరాల : రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్ని మంత్రి సవిత తెలిపారు. చేనేత సహకార సంఘాల బలోపేతంపై ఆయన దృష్టి సారించారన్నారు. త్వరలోనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. తర్వాత ఆప్కో ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చేనేత సహకార సంఘాలు బలోపేతమైతే నేతన్నలకు, కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. చేనేత సహకార సంఘాల బకాయిలను సైతం చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. రానున్న జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు కూడా చీరాలలోనే నిర్వహించే అవకాశముందని వెల్లడించారు. అమరావతిలో రూ.10 కోట్లతో ప్రగడ కోటయ్య స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
చేనేతలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచని అని మంత్రి సవిత తెలిపారు. ఒకవైపు చేనేత రంగ అభివృద్దికి ప్రాధాన్యమిస్తూనే, వ్యక్తిగతంగా నేతన్నలకు ఆర్థిక చేయూతనివ్వాలన్నది ఆయన సంకల్పమన్నారు. దీనిలో భాగంగానే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంద జేస్తున్నామన్నారు. చేనేతలకు పెన్షన్లు అమలు చేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబు దేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మగం నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. వాటితో ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా ఏటా రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేసే నేతన్న సేవలో…పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. వచ్చే నెల ఏడో తేదీన జాయతీ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అర్హులైన నేతన్నలందరికీ వయస్సు సంబంధం లేకుండా నేతన్న సేవలో పథకాన్ని వర్తింప జేస్తామన్నారు.
















