Google : ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏపీ వైపు పేరు పొందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని స్పష్టం చేశారు . ఈ సందర్బంగా మంగళవారం భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో విశాఖపట్నంలో నూతనంగా 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూ కుదుర్చుకుంది ఏపీ సర్కార్. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ (Google) ప్రతినిధుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్) పాల్గొన్నారు.
Google Huge Investments in AP
ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక కీలక మార్పులు తీసుకు వచ్చామన్నారు. ఏపీని అన్ని రంగాలలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏఐ , ఎంఎల్ హబ్ గా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందులో భాగంగా గూగుల్ తమ సర్కార్ తో కలిసి రావడం తమకు మరింత ఆనందాన్ని ఇచ్చేలా చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చేలా చేస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల నవంబర్ 14, 15 తేదీలలో విశాఖ వేదికగా ఐసీసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : HCA Open Selection Interesting : అండర్-19 మహిళా క్రీడాకారుల కోసం ఓపెన్ సెలక్షన్స్
