HCA Open Selection Interesting : అండ‌ర్-19 మ‌హిళా క్రీడాకారుల కోసం ఓపెన్ సెలక్షన్స్

ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్

Hello Telugu - HCA Open Selection Interesting

Hello Telugu - HCA Open Selection Interesting

HCA : హైద‌రాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం అధికారికంగా నోటిఫికేష‌న్ జారీ చేసింది. అండర్-19 మహిళా క్రీడాకారుల కోసం ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. 2025–26 సీజన్ కోసం రాబోయే బీసీసీఐ టోర్నమెంట్‌ల కోసం రాష్ట్ర జట్లను ఎంపిక చేయడానికి ఈ ట్రయల్స్ నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపింది. అక్టోబ‌ర్ 15న ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించింది. 16న కూడా సాయంత్రం 5 గంట‌ల లోపు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. ఆయా అర్హ‌త క‌లిగిన అండ‌ర్ -19 మ‌హిళా క్రీడాకారులు స్వ‌యంగా హైద‌రాబాద్ ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం ప్రెస్ కాన్ఫ‌రెన్స్ హాల్ లో స‌మ‌ర్పించాల‌ని తెలిపింది.

HCA Open Selection

ఇదిలా ఉండ‌గా ఆయా జిల్లాల నుండి ఆటగాళ్ళు 15న రిపోర్టు చేయాల‌ని కోరింది. ఆరోజు హాజ‌రు కాక పోతే 16న ఉప్పల్ లోని ఆర్జీఐసీఎస్ ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల మ‌ధ్య రిపోర్ట్ చేయొచ్చ‌ని తెలిపింది హెచ్ సీ ఏ. తేది 1వ తేదీ సెప్టెంబ‌ర్ 2006న లేదా ఆ త‌ర్వాత జ‌న్మించిన ఆట‌గాళ్లు ఇందులో పాల్గొనేందుకు మాత్ర‌మే అర్హుల‌ని పేర్కొంది. ఆట‌గాళ్లు ఆర్జీఐసీఎస్ గేట్ నెంబ‌ర్ 1 ద్వారా రిపోర్టు చేయాలి. త‌మ స్వంత క్రికెట్ కిట్ ను తీసుకు వెళ్లాలి. తెల్ల‌టి దుస్తులు మాత్ర‌మే ధ‌రించాలి. ధ్రువీక‌ర‌ణ కోసం ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. డిజిటైజ్ చేయబడిన జనన తేదీ ధృవీకరణ పత్రంతో పాటు ఒక జిరాక్స్ ఫోటోకాపీ. పూర్తి సైజు ఆధార్ కార్డ్‌తో పాటు ఒక జిరాక్స్ ఫోటోకాపీ. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ స‌మ‌ర్పించాల‌ని వెల్ల‌డించింది.

Also Read : Ex Minister Dharmana Warning : ప్రజా ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచుతాం

Exit mobile version