Mahindra : మహారాష్ట్ర : కేంద్ర సర్కార్ జీఎస్టీ స్లాబ్ రేట్స్ తగ్గించడంతో భారీ ఎత్తున వినియోగదారులు, ప్రజలకు, వాహనదారులకు ఒకింత మేలు చేకూర్చనుంది. నిన్న ప్రముఖ దిగ్గజ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో భాగంగా పెద్ద ఎత్తున ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. తాజాగా శనివారం మరో దిగ్గజ వాహన సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా తమ వాహనాలకు సంబంధించి ధరలను గణనీయంగా తగ్గించినట్లు వెల్లడించింది. మహీంద్రా (Mahindra) వాహన వినియోగదారులకు ఇది శుభవార్త అని పేర్కొంది.
Mahindra Gives Key Update
వాహనదారులకు సంబంధించి మహీంద్రా వాహనాలకు రూ. 1.56 లక్షల వరకు, టయోటా కు ర. 3.46 లక్షల వరకు తగ్గించినట్లు స్పష్టం చేసింది. ఇందులో ఐసీఈ ఎస్ యు వీ పోర్ట్ ఫోలియో రూ. 1.56 లక్షలకు పైగా జీఎస్టీ 2.0 ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు అందజేస్తామని తెలిపింది.
కంపెనీ వెల్లడించిన మేరకు తమ వాహనాలైన థార్, స్కార్పియో, బోలెరో, ఎక్స్ యూ వీ 700, స్కార్పియో-ఎన్ వంటి మోడళ్లు రూ.1.01 లక్షల నుండి రూ.1.56 లక్షల వరకు ప్రయోజనం పొందుతారని తెలిపింది.
బొలెరో, బొలెరో నియో రూ.1.27 లక్షల వరకు చౌకగా లభిస్తుండగా, ఎక్స్ యు వీ 3 ఎక్స్ ఓ పెట్రోల్ వాహనం రూ. 1.40 లక్షల వరకు తగ్గుతుంందని స్పష్టం చేసింది. XUV3XO డీజిల్ రూ.1.56 లక్షల తగ్గింపుతో లభిస్తుందని తెలిపింది. స్కార్పియో-ఎన్ రూ.1.45 లక్షల వరకు, థార్ రాక్స్ రూ.1.33 లక్షల వరకు, ఫ్లాగ్‌షిప్ XUV700 రూ.1.43 లక్షల వరకు అందుబాటులో ఉందని పేర్కొంది మహీంద్రా అండ్ మహీంద్రా.
Also Read : Pavagadh Hill Shocking Incident : గుజరాత్ పావగఢ్ హిల్స్ రోప్ వే తెగిపడి 6 మృత్తి
