Infosys : దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా పేరుగాంచిన ఇన్ఫోసిస్, తన ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గానూ ఉత్సాహాన్నిచ్చే బోనస్ ప్రకటించింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలం కోసం పని తీరును బట్టి ఈ ప్రోత్సాహక బోనస్‌ను ఇవ్వనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఇన్ఫోసిస్ (Infosys) వెల్లడించిన వివరాల ప్రకారం, అర్హత కలిగిన ఉద్యోగులకు సగటున 80 శాతం వరకూ బోనస్ లభించనుంది. ఈ మొత్తాన్ని ఆగస్టు నెల వేతనంతోపాటు చెల్లించనున్నారు. సంబంధిత సమాచారం ఉద్యోగులకు అంతర్గతంగా ఇ-మెయిల్‌లు మరియు మెసేజ్‌ల ద్వారా అందించబడుతోందని తెలిసింది.
Infosys – బోనస్ శాతం ఎలా ఉన్నది?
బోనస్ చెల్లింపులను ఉద్యోగుల స్థాయిలను బట్టి వివిధ శ్రేణుల్లో విభజించారు. ఇందులో ముఖ్యంగా పీఏల్-4 స్థాయి ఉద్యోగులకు అత్యధికంగా 89 శాతం వరకూ బోనస్ అందించనున్నారు. సాధారణంగా టార్గెట్లను చేరుకున్న ఉద్యోగులకు 80 శాతం వరకు ప్రోత్సాహక బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.
పీఎల్-5 స్థాయికి చెందిన ఉద్యోగులకు 78% నుండి 87% మధ్య బోనస్ లభించనుంది. అదే విధంగా పీఎల్-6 స్థాయికి చెందిన వారికి 75% నుండి 85% మధ్య బోనస్ చెల్లించనున్నారు.
Infosys – కార్యక్షమతపై ప్రత్యేక దృష్టి
పని తీరుపై సంస్థ ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. పీఎల్ 4, 5, 6 స్థాయిలలో ఉన్న పనితీరు మెరుగుపర్చాల్సిన ఉద్యోగులకు కూడా సంస్థ బోనస్ ఇవ్వనుంది. ఈ క్రమంలో వారు వరుసగా 80%, 75%, 70% శాతం మేర బోనస్‌కు అర్హులయ్యే అవకాశం ఉందని సంస్థ అంతర్గత మెమోలో పేర్కొంది.
ఇ-డాకెట్స్ ద్వారా అధికారిక సమాచారం
ఉద్యోగులందరికీ బోనస్‌కి సంబంధించిన అధికారిక లెటర్లు త్వరలోనే ఇ-డాకెట్స్ (E-Documents portal) లో అప్‌లోడ్ చేయనున్నట్లు సంస్థ తెలియజేసింది. ఉద్యోగులు తమ అకౌంట్ల ద్వారా లాగిన్ అయి సంబంధిత వివరాలను చూసుకునే అవకాశం కలిగించనున్నారు.
ఉత్సాహవంతమైన వాతావరణం
ఇన్ఫోసిస్ తాజా ప్రకటన, సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో మాంద్యం కనిపిస్తున్న తరుణంలో, ఉద్యోగులకు బోనస్ చెల్లించడం ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచుతుందని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Huge Gold Deposits : ఒడిశా పలు జిల్లాల్లో భారీగా బంగారు నిల్వలు
