భారత క్రికెట్ కు స్వర్ణ యుగం : డీకే అరుణ

ఆట‌గాళ్లు అద్భుతం చేశారంటూ కితాబు

hellotelugu-DKAruna

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు, ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైనై ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో న్యూజిలాండ్ ను మ‌ట్టి క‌రిపించి భార‌త్ జ‌ట్టు విశ్వ విజేతగా నిల‌వ‌డం ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. భార‌తీయ క్రీడా రంగానికి ప్రత్యేకించి క్రికెట్ కు ఇది స్వ‌ర్ణ యుగం అని పేర్కొన్నారు. ఆనాడు క‌పిల్ దేవ్ సార‌థ్యంలోని భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచింద‌ని, అలాంటి స‌న్నివేశం ఇప్పుడు పున‌రావృతం అయ్యింద‌న్నారు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించిన భార‌త ఆట‌గాళ్ల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు.

న్యూజిలాండ్ ను 96 ప‌రుగుల భారీ తేడాతో ఓడించి విశ్వ విజేత‌గా నిలిచిన టీం ఇండియాకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కిరీటాన్ని విజయవంతంగా కాపాడుకున్న మొదటి దేశంగా అవతరించడం భార‌తీయురాలిగా గ‌ర్వ కార‌ణంగా ఉంద‌న్నారు . ఇది ధైర్యసాహసాల సింఫొనీ, వ్యూహాత్మక ప్రతిభ కళాఖండం , బిలియన్ కలల లొంగని స్ఫూర్తికి నిదర్శనం. నరేంద్ర మోడీ స్టేడియంలో ఉరుములతో కూడిన గర్జనల నుండి దేశంలోని ప్రతి మూల వరకు భార‌త మాత స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకునేలా చేసినందుకు మీకు మ‌రోసారి కంగ్రాట్స్ అంటూ ప్ర‌శంసించారు ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి.

Exit mobile version