Gold : గత కొన్ని వారాలుగా పెరుగుదల చూపిన బంగారం ధరలు ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ధరల మీద ప్రభావం చూపే అంశాలు మారడంతో పాటు, దేశీయంగా రూపాయి బలపడటం వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Gold Price Updates
ఆగస్టు 20వ తేదీ ఉదయం 6 గంటలకు నమోదైన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 1,00,740కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల ధర రూ. 92,340గా ఉంది. ఈ క్రమంలో, గతంలో రూ.90,000 పరిధిలో ఉన్న బంగారం (Gold) ధరలు లక్ష రూపాయలు దాటినప్పటికీ, ఇప్పుడు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది.
ఇక ఇతర క్యారెట్ల బంగారం ధరల విషయానికొస్తే, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,550గా ఉంది. వెండికి సంబంధించి కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,15,900గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు సమానంగా ఉండగా, ఢిల్లీలో మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నగరాలవారీగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- హైదరాబాద్ – రూ. 1,00,740
- ముంబై – రూ. 1,00,740
- ఢిల్లీ – రూ. 1,00,890
- విజయవాడ – రూ. 1,00,740
- కోల్కతా – రూ. 1,00,740
- బెంగళూరు – రూ. 1,00,740
- కేరళ – రూ. 1,00,740
- చెన్నై – రూ. 1,00,740
22 క్యారెట్ల ధరలు ఈ నగరాల్లో సాధారణంగా రూ. 92,340గా నమోదయ్యాయి. ఢిల్లీలో మాత్రమే రూ. 92,490కి చేరాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు గోల్డ్ రేట్ వెబ్‌సైట్ల ద్వారా సేకరించబడినవి. దినసరి మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు.
బంగారం ధరల తగ్గుదలకు పలు కారణాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై టారిఫ్‌లు విధించబోమని ప్రకటించడం, అలాగే భారతీయ రూపాయి బలపడటం వలన బంగారం దిగుమతుల వ్యయం తగ్గడం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి డిమాండ్ తక్కువగా ఉండడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది.
బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, వచ్చే కొన్ని రోజుల్లో ఇదే ధోరణి కొనసాగే అవకాశముందని చెబుతున్నారు. అయినప్పటికీ, పెట్టుబడిదారులు లేదా ఆభరణాల కొనుగోలుదారులు తమ అవసరాలను బట్టి, స్థానిక ధరలను పరిశీలించి, నిర్ణయం తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : నెమ్మదిగా ఆడవాళ్లకు ఉరటనిస్తున్న పసిడి ధరలు
