Today Gold Price : పసిడికి భారీగా డిమాండ్ పెరగడంతో పెరుగుతూ పోతున్న ధరలు

పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడం వల్ల బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది.

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ, కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, అలాగే పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడం వల్ల బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది.

Gold Price Updates

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం (Gold) ధరల పెరుగుదలకు కారణమైంది. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 5వ తేదీ (శనివారం) నాటికి దేశీయ బంగారం మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,19,400కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,09,450గా నమోదైంది.

రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,19,550, 22 క్యారెట్ల ధర రూ. 1,09,600గా ఉంది. హైదరాబాద్‌ మరియు విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,400, 22 క్యారెట్ల ధర రూ. 1,09,450గా కొనసాగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే స్థాయిలో ధరలు నమోదయ్యాయి.

ఇక వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీకి సుమారు రూ. 100 మేర తగ్గింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు కేజీకి రూ. 1,55,000 నుండి రూ. 1,65,000 మధ్య ట్రేడ్ అవుతున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళ ప్రాంతాల్లో వెండి ధర కేజీకి రూ. 1,65,000గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో రూ. 1,55,000గా నమోదైంది.

నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ బంగారం మార్కెట్‌లో మార్పులు, రూపాయి విలువలో కొనసాగుతున్న క్షీణత, అలాగే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్ని కొనసాగిస్తారని వారు పేర్కొంటున్నారు.

Also Read : Today Gold Price : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త

Exit mobile version