Gold : దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం ఫలితంగా బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడడం కూడా బంగారం ధరల పెరుగుదలకే దారితీస్తోంది.
అక్టోబర్ 8న దేశవ్యాప్తంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ. 1,23,940కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,13,610గా ఉంది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు)
- హైదరాబాద్: 24 క్యారెట్ – ₹1,23,940 | 22 క్యారెట్ – ₹1,13,610
- విజయవాడ: 24 క్యారెట్ – ₹1,23,940 | 22 క్యారెట్ – ₹1,13,610
- ఢిల్లీ: 24 క్యారెట్ – ₹1,24,090 | 22 క్యారెట్ – ₹1,13,760
- ముంబై: 24 క్యారెట్ – ₹1,23,940 | 22 క్యారెట్ – ₹1,13,610
- వడోదర: 24 క్యారెట్ – ₹1,23,990 | 22 క్యారెట్ – ₹1,13,660
- కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణే: 24 క్యారెట్ – ₹1,23,940 | 22 క్యారెట్ – ₹1,13,610
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
- హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ: ₹1,70,010
- ఢిల్లీ, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్, కోల్‌కతా: ₹1,60,010
వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగి నిన్నటితో పోల్చితే సుమారు ₹100 వరకు పెరిగాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత కొనసాగినంత వరకు బంగారం ధరలు మరింత పెరుగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read : Gold Price Growth : పసిడి పంజా! లక్షా 23 వేల దాటిన బంగారం ధరలు
