హైదరాబాద్ : తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 కు సిద్దమైంది హైదరాబాద్. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిందని చెప్పారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాల్టి నుంచి రేపటి వరకు రెండు రోజుల పాటు సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున ఎవరూ ఊహించని విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన పనులను పరిశీలించారు. దాదాపు పూర్తయ్యాయని ఇక రాబోయే అతిథుల కోసం నిరీక్షిస్తున్నామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, నవీన ఆవిష్కరణలకు కేంద్రంగా, తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అన్ని వసతులతో ఆకట్టుకునేలా అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరుసగా రెండో రోజు ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించడం జరగిందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సదస్సు జరిగే చోటా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అనేక డిజిటల్ స్క్రీన్ లు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే అనేక సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు చేశామన్నారు.

















