CM Revanth Reddy : హైదరాబాద్ : రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల పనితీరు మరింత మెరుగు పడేలా చూడాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 60 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కలిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసీసీసీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy Focus
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపునకు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా, జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్‌ను ఉపయోగించాలని అన్నారు సీఎం. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని, దాంతో వారికి లభించే కేలరీలను తెలుసు కోవాలని అన్నారు.
Also Read : CM Chandrababu-PM Modi Important Meeting : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
