ముంబై : భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా దేశీవాలి టోర్నీలలో నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు చేకూర్చి పెడుతున్న కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పట్ల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నాడు. ఏ బౌలింగ్ లో నైనా ఎదుర్కోగల సహజ సామర్థ్యం సామ్సన్‌కు ఉందని గవాస్కర్ పేర్కొన్నాడు. స్థిరమైన అవకాశాలతో, అతను భారతదేశానికి గణనీయమైన మ్యాచ్-విజేతగా మారగలడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
సంజూ సామ్సన్‌ను పక్కన పెట్టడంపై , తీసుకున్న నిర్ణయాలను గవాస్కర్ విమర్శించాడు. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరోటి కాదన్నాడు. సామ్సన్ జట్టులో ఉంటే, అతను రిజర్వ్‌లలో కాకుండా ప్లేయింగ్ XIలో ఉండాలి అని అతను వాదించాడు, అతను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేయగలడని సూచించాడు. సామ్సన్ సెంచరీలు తన ప్రతిభను నమ్మడానికి సహాయ పడతాయని, అతను ఎల్లప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాడని గుర్తిస్తాయని అన్నాడు గవాస్కర్. ఒకటి రెండు మ్యాచ్ లలో ఏ ఒక్క ఆటగాడి పూర్తి సామర్థ్యాలు బయటకు రావన్నాడు. ఇకనుంచైనా జట్టు కోచ్ శాంసన్ కు కంటిన్యూగా ఓ ఐదు మ్యాచ్ లు ఆడేలా చూడాలని సూచించాడు.
