సీఎం చంద్ర‌బాబుతో గౌత‌మ్ అదానీ భేటీ

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై చ‌ర్చ

hellotelugu-GautamAdani

అమ‌రావ‌తి : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ మ‌ర్యాద పూర్వ‌కంగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించారు. ఇటీవ‌ల అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్ , సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అంచనా వేయడానికి , కొత్త పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి గాను ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబు నాయుడు , గౌత‌మ్ అదానీ చ‌ర్చించారు.

అమరావతి రాజధాని ప్రాంతంలోని ముఖ్యమైన పరిణామాలను హైలైట్ చేయడానికి, సహకార ప్రయత్నాల ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి మార్గాలను గుర్తించడానికి ఈ సమావేశం లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయని స్ప‌ష్టం చేశారు స‌మావేశంలో పాల్గొన్న రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించడం, ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలను అన్వేషించిన సందర్భంగా గౌతమ్ అదానీ , కరణ్ అదానీలను కలవడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు .ప్ర‌ధానంగా ప్ర‌స్తుత‌ ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి సారించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టికే దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఏపీ వైపు చూస్తున్నాయ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడ‌ల్ గా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ విశ్వాసం త‌మ‌కు ఉంద‌న్నారు నారా లోకేష్.

Exit mobile version