KTB Chief Gantla Srinubabu Interesting : రక్షణ రంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

డాక్ యార్డు కేటీబీ గౌరవ అధ్య‌క్షుడు గంట్ల శ్రీ‌నుబాబు

Hello Telugu - KTB Chief Gantla Srinubabu Interesting

Hello Telugu - KTB Chief Gantla Srinubabu Interesting

Gantla Srinubabu : విశాఖ‌ప‌ట్నం – ర‌క్ష‌ణ రంగంలో ప‌ని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని అన్నారు డాక్ యార్డ్ కేటీబీ అసోసియేష‌న్ నూత‌న అధ్య‌క్షుడు గంట్ల శ్రీ‌నుబాబు (Gantla Srinubabu). డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా గంట్ల శ్రీనుబాబు (Gantla Srinubabu), అధ్యక్ష, కార్యదర్శులుగా బత్తుల చిరంజీవి, విజనగిరి భాస్కరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా విరోతి వెంకటేష్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా యాతము రాజ్ కుమార్, కోశాధికారిగా గనిరెడ్డి శ్రీనివాస్ తో కలిపి మొత్తం 27 మందిని ఎన్నుకున్నారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం నేపధ్యంలో సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన కార్యవర్గ సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Gantla Srinubabu Key Comments

అనంతరం తొలిసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో సేవ చేసే అవకాశం లభించడం ప్రతి ఒక్కరూ పూర్వ జన్మ సుకృతంగా భావించాలన్నారు. అలాగే గతం కంటే మరింత వేగవంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతో కేటిబి కళాక్షేత్రాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చుకోగలిగామన్నారు. అందులో ఒక అంతస్తుకు తాను దాత కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు గంట్ల శ్రీ‌ను బాబు.

అధికారుల, ఉద్యోగుల సంక్షేమానికి (సభ్యుల) తన వంతు కృషి చేస్తామన్నారు. రెండో సారి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులందరికి ఆయన పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల చిరంజీవి, విజనగిరి భాస్కరరావులు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏడాదిలో వైద్య‌, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు.

అంతే కాకుండా ఇతర పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులకు అసోసియేషన్ నిరంతరం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం పలు తీర్మాణాలు చేసింది. మూడేళ్ల పాటు ఈ కార్యవర్గం కాలపరిమితిగా నిర్ణయించారు. అలాగే పలువురు సీనియర్ లను సలహాదారులుగా , కొందరు న్యాయవాదులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించు కోవాలని వీరంతా నిర్ణయం తీసుకున్నారు. నూతన కార్యవర్గానికి సభ్యులంతా అభినందనలు తెలియజేశారు.

Also Read : ITC Network Scam : రూ. 750 కోట్ల న‌కిలీ ఐటీసీ నెట్ వ‌ర్క్ స్కామ్

Exit mobile version