ఫుట్ బాల్ ఫ్యాన్ క్ల‌బ్ పై గంగూలీ ప‌రువు న‌ష్టం దావా

రూ. 50 కోట్లు చెల్లించాల‌ని కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

hellotelugu-SouravGanguly

కోల్ క‌తా : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీకి కోపం వ‌చ్చింది. ఆయ‌న ఏకంగా రూ. 50 కోట్లు చెల్లించాలంటూ ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశాడు కోర్టులో. ఇందుకు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. క్రికెటర్ నుండి క్రీడా నిర్వాహకుడిగా మారిన గంగూలీ అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫ్యాన్ క్లబ్’కి చెందిన ఉత్తమ్ సాహాపై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. లియోనెల్ మెస్సీ వైఫల్యంలో తన పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నాడు. త‌న గురించి ప‌రువు న‌ష్టం క‌లిగించేలా బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపాడు సౌర‌వ్ గంగూలీ. త‌క్ష‌ణ‌మే త‌న‌కు రూ. 50 కోట్లు చెల్లంచాల‌ని లీగ‌ల్ నోటీసు జారీ చేశాడు.

ఈ సంద‌ర్బంగా దాదా మీడియాతో మాట్లాడాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫ్యాన్ క్లబ్’కి చెందిన ఉత్తమ్ సాహా నాకు వ్య‌క్తిగ‌తంగా భంగం క‌లిగిలించేలా కామెంట్స్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. మెస్సీ గోట్ ఇండియా టూర్ నిర్వహించడం వెనుక అసలు వ్యక్తి గంగూలీ సాహా ఆరోపించ‌డం ప‌ట్ల ఆగ్రహం వ్య‌క్తం చేశారు.
తాజాగా అరెస్టు చేయబడిన ప్రధాన నిర్వాహకుడు సతద్రు దత్తా ఒక ఫ్రంట్ మాత్రమే అని ఆరోపించారు. కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్‌కు ఇమెయిల్ చేసిన తన ఫిర్యాదులో, ఆ వ్యక్తి చేసిన ప్రకటనలు తన ప్రతిష్ట కు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌న్నాడు దాదా. అంతే కాదు మానసిక ప్రశాంతతను ప్రతికూలంగా ప్రభావితం చేశాయని గంగూలీ అన్నారు. ఎలాంటి వాస్తవ ఆధారం లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Exit mobile version