Gachibowli Plot Cost Shocking :రూ. 33 కోట్ల‌కు అమ్ముడు పోయిన గ‌చ్చిబౌలి ప్లాట్

హైద‌రాబాద్ లో అత్య‌ధిక ధ‌ర ప‌లికి..రికార్డ్ బ్రేక్

Hello Telugu - Gachibowli Plot Cost Shocking

Hello Telugu - Gachibowli Plot Cost Shocking

Gachibowli : హైద‌రాబాద్ – స‌ర్కార్ మారినా రియ‌ల్ ఎస్టేట్ బూమ్ మాత్రం మార‌డం లేదు. దేశంలోనే అత్య‌ధిక డిమాండ్ క‌లిగిన ప్రాంతంగా హైద‌రాబాద్ నిలిచింది. తాజాగా స‌ర్కార్ న‌గ‌రంలోని ప‌లు చోట్ల వేలం పాట‌లు నిర్వ‌హించింది. ఈ ఆక్ష‌న్ లో ఏకంగా భారీ ధ‌ర‌కు ప్లాటు అమ్ముడు పోయింది. గ‌చ్చి బౌలిలోని ప్లాట్ల వేలం పాట‌లో ఏకంగా ఓ ప్లాట్ రూ. 33 కోట్ల‌కు అమ్ముడు పోయింది. అంద‌రిని విస్తు పోయేలా చేసింది. ప్లాట్ చ‌ద‌రపు గ‌జం రూ. 2.22 ల‌క్ష‌లు ప‌లికింది.

Gachibowli Plot Cost Shocking

రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డు స్థాయిలో పెరుగుతోంద‌ని అని చెప్పేందుకు ఈ వేలం పాట ఓ ఉదాహ‌ర‌ణ‌. భూమి ధ‌ర‌లు బూమ్ అందుకుంటున్నాయి. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కొనుగోలు చేయ‌లేని స్థితికి చేరుకున్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు వేలం పాట‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మ‌వ‌డ‌లం గ‌చ్చిబౌలిలో (Gachibowli) వాణిజ్య ప్లాట్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయింది. ఇది న‌గ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన అత్య‌ధిక ధ‌ర‌ల‌లో ఒక‌టిగా నిలిచింది.

ఇక వేలం పాట‌లో భాగంగా నాలుగు ప్రీమియం ప్లాట్ల‌కు బిడ్ లు పిలిచారు. డాగ్ పార్క్ ద‌గ్గ‌ర‌లో ఉన్న 1,487 చ‌ద‌ర‌పు గ‌జాల ప్లాట్ కు చ‌ద‌రుపు గ‌జానికి రూ. 1.20 ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌తో మొద‌లైంది. ప్లాట్ చివ‌ర‌కు రూ. 33 కోట్ల‌కు అమ్ముడు పోయింది. ఈ వేలం పాట‌లో 53 మంది బిడ్డ‌ర్లు పాల్గొన్నారు. గ‌చ్చి బౌలిలోనే అత్య‌ధిక మంది పాల్గొన్నారు.

చింత‌ల్ లోని 10 ఎంజీఐ ప్లాట్ల‌లో 3 అమ్ముడు పోయాయి. దీని ద్వారా రూ. 8.11 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. బాచుప‌ల్లిలో 8 ప్లాట్ల‌ను విక్ర‌యించింది హౌసింగ్ బోర్డు. మొత్తం రూ. 65 కోట్ల ఫ్రాఫిట్ ల‌భించింది.

Also Read : Passport Verification – TG Popular : పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్

Exit mobile version