Fuel Efficiency Shocking Update : ఈ20 పెట్రోల్ వాడకం వళ్ళ 2 నుండి 5 శాతం మైలేజీ తగ్గుతుందంటున్న నిపుణులు

వాహనాల మైలేజ్ తగ్గుతుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు...

Hello Telugu - Fuel Efficiency Shocking Update

Hello Telugu - Fuel Efficiency Shocking Update

Fuel : దేశంలో శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) వినియోగాన్ని వేగంగా అమలు చేస్తోంది. దీనివల్ల దిగుమతి ఆధారిత ఇంధన వినియోగం తగ్గి, దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు ప్రోత్సాహం లభిస్తుంది. అయితే, ఈ కొత్త ఇంధనం వాడకంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, వాహనాల మైలేజ్ తగ్గుతుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Fuel – మైలేజ్ తగ్గుదలపై నిపుణుల వ్యాఖ్యానాలు

ఇథనాల్‌లో క్యాలొరిఫిక్ విలువ పెట్రోల్‌ (Fuel) కంటే తక్కువగా ఉండటమే మైలేజ్‌పై ప్రభావానికి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోల్‌లో (Fuel) 20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిపినప్పుడు శక్తి ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, కొన్ని వాహనాల్లో మైలేజ్ సుమారు 2-5 శాతం వరకూ తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

పాత వాహనాలపై ప్రభావం

ఇప్పటికే మార్కెట్‌లోకి వస్తున్న వాహనాలను E20 ఇంధనానికి అనుకూలంగా తయారు చేస్తున్నారు. కానీ 2009కు ముందు తయారైన పాత వాహనాలపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. ముఖ్యంగా, ఇంధన వ్యవస్థలోని రబ్బరు భాగాలు, గాస్కెట్లు, పైపులు తరిగిపోవడం వంటి సమస్యలు కనిపించే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఇవి తక్షణ సమస్యలు కావని, సమయానుగుణంగా చూడాల్సినవని నిపుణులు సూచిస్తున్నారు.

మైలేజ్ తగ్గుదలపై ప్రభుత్వ స్పష్టత

ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులకు స్పందించిన చమురు మంత్రిత్వ శాఖ, మైలేజ్‌లో గణనీయమైన తగ్గుదల అనేది వాస్తవానికి దూరమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు తయారైన వాహనాల్లో కూడా E20 వాడకానికి పెద్ద అడ్డంకులు లేవని తెలిపింది. అధిక శాతం వాహనాలు ఇప్పటికే ఈ మిశ్రమానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

E20 ప్రయోజనాలపై ప్రభుత్వం వివరాలు

చమురు మంత్రిత్వ శాఖ ప్రకారం, E20 కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసిన వాహనాలు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడమే కాకుండా, వేడి నియంత్రణ, గాలి-ఇంధన మిశ్రమ సమతుల్యత వంటి అంశాల్లోనూ ఉత్తమ ఫలితాలను ఇస్తాయని తెలిపింది. ఇథనాల్‌లో ఉండే అధిక బాష్పీభవన ఉష్ణోగ్రత ఇంజిన్‌ను గరిష్ట ఉష్ణోగ్రతకు దూరంగా ఉంచుతుందని వివరించింది.

తుది నిర్దారణ

E10 వాహనాల్లో E20 వాడినా మైలేజ్‌పై తీవ్ర ప్రభావం ఉండదని, తక్కువశాతం మార్పులు మాత్రమే కనిపించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా, పాత వాహనాలలో మైలేజ్ తగ్గితే, అది వాహన వయసు వల్లే అవుతుందని వెల్లడించింది.

Also Read : Minster Kandula Durgesh – AP Growth : సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ : కందుల దుర్గేష్

Exit mobile version