Free Bus : అమరావతి – ఏపీలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించేందుకు ఉద్దేశించిన పథకాన్ని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ స్కీం వల్ల లక్షలాది మంది మహిళలు, బాలికలు, యువతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ఎన్నికల సందర్బంగా ఉచితంగా బస్సు జర్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాలలో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకాన్ని, విధి విధానాలను పరిశీలించారు. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ తయారు చేశారు.
AP Free Bus Service
ఏపీకి చెందిన వారు ఎవరైనా సరే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలంటే విధిగా తమ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, లేదా పాన్ కార్డు, లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జారీ చేసిన కార్డులను బస్సులలో ప్రయాణించే ప్రయాణీకులు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు. దీనికి ప్రభుత్వం స్త్రీ శక్తి రాష్ట్ర వ్యాప్త బస్సు ప్రయాణం అని నామకరణం చేసింది. ఆంధ్రప్రదేశ్ నివాస హోదా కలిగిన బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు స్త్రీ శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించ వచ్చని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్కీంను ప్రారంభించిన అనంతరం బాబుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు బస్సులో ప్రయాణం చేశారు.
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేశారు. దాదాపు 2.62 కోట్ల మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతారని ఏపీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోంది.
Also Read : Rahul Gandhi- Kharge Avoid : ఇండిపెండెన్స్ డేకు రాహుల్, ఖర్గే దూరం
