Sebastien lecornu : పారిస్, అక్టోబర్ 6 (ఏజెన్సీలు): ఫ్రాన్స్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను (Sebastien lecornu) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు తర్వాతే ఈ నిర్ణయం ప్రకటించారు. కేవలం ఒక నెలలోపే పదవిని విడిచిపెట్టడం ఫ్రాన్స్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
Sebastien lecornu Resign Sensational
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ లెకోర్ను రాజీనామాను అంగీకరించినట్లు అధ్యక్ష భవనం (ఎలిసీ ప్యాలెస్) అధికారిక ప్రకటనలో తెలిపింది. లెకోర్ను కేబినెట్‌లో మంత్రుల ఎంపికపై వచ్చిన తీవ్ర విమర్శల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
లెకోర్ను మంత్రివర్గంలో మాజీ ఆర్థిక మంత్రి బ్రూనో లే మెయిర్‌ను రక్షణ మంత్రిగా నియమించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ నిర్ణయంపై విపక్షాలతో పాటు అధికార పార్టీ అంతర్గత వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి.
ఇకపోతే, కీలక పదవుల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ఇంటీరియర్ మంత్రిగా బ్రూనో రీటైల్లెయూ, విదేశాంగ మంత్రిగా జీన్ నోయెల్ బారోట్, అలాగే న్యాయ మంత్రిగా జెరాల్డ్ డార్మానిన్ తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
పార్లమెంట్‌లోని విభిన్న రాజకీయ వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నంలో లెకోర్ను ప్రత్యేక రాజ్యాంగ అధికారం (ఆర్టికల్ 49.3) వినియోగించబోమని స్పష్టం చేశారు. బడ్జెట్‌ను ఓటింగ్ లేకుండా ఆమోదించే ఆ అధికారం వినియోగించకుండా, ఎడమ-కుడి పక్షాల మద్దతు పొందే ప్రయత్నం చేశారు.
అయితే, ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పాటు, మంత్రివర్గ కూర్పులో దూరదృష్టి లేకపోయిందన్న విమర్శలు పెరిగాయి. చివరికి లెకోర్ను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ మాక్రోన్ కొత్త ప్రధానమంత్రిని నియమించే బాధ్యతను ఎదుర్కొంటున్నారు, దీంతో ఫ్రాన్స్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
Also Read : EPFO New Innovation : వినియోగదారులకు సులభతరం చేయడానికి మరో కొత్త రూల్
