ఉత్త‌మ్ కుమార్ రెడ్డివ‌న్నీ ఉత్త మాట‌లే : శ్రీ‌నివాస్ గౌడ్

పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వివ‌క్ష త‌గ‌దు

hellotelugu-VSrinivasGoud

జోగులాంబ గ‌ద్వాల జిల్లా : మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు గ‌ద్వాల‌లో. ఒక మంత్రి ప‌ద‌వి స్థానంలో ఉన్న త‌ను ఎలాంటి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. త‌మ స‌ర్కార్ హ‌యాంలో పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 80 శాతం పూర్త‌యింద‌ని, మిగ‌తా 20 శాతం ఎందుకు పూర్తి చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. దీనిని ఎంత త్వ‌ర‌గా పూర్తి చేస్తే వేలాది ఎక‌రాలు సాగుకు నోచుకుంటాయ‌ని తెలిపారు. రాష్ట్రంలో నీటి పారుద‌ల గురించి ప్రాథ‌మిక అవ‌గాహ‌న లేక పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీని వ‌ల్ల న‌ష్ట‌మే త‌ప్పా ఎలాంటి ఫాయిదా ఉండ‌ద‌న్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక్క కాలువ కూడా తవ్వలేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్ప‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. కాలువ తవ్వకపోతే నీళ్లు ఎలా వస్తాయి అని ప్ర‌శ్నించారు. లక్ష్మీదేవిపల్లి మినహా అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని , ఆ విష‌యం తెలియ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. మీరు వచ్చిన తర్వాత చేయడానికి ఏమీ లేద‌న్నారు. గద్వాల లోని కాలువల్లో ఒక్క చెట్టు కూడా తొల‌గించ లేద‌ని, ఒక్క అడుగు కూడా ముందుకు సాగ‌లేద‌ని, ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు. మీరు గట్టు లిఫ్ట్ పూర్తి చేశారా? రెండు సంవత్సరాల్లో గట్టు లిఫ్ట్‌లో మీ వాటా ఎంత? రాయలంపాడు రిజర్వాయర్‌ను ఎందుకు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు శ్రీ‌నివాస్ గౌడ్.

Exit mobile version