హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం మహబూబ్ నగర్ లో మాట్లాడిన తీరు దారుణంగా ఉందన్నారు. మరోసారి తమ నాయకుడు కేసీఆర్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడం పట్ల మండిపడ్డారు. ఇది సీఎం స్థాయి వ్యక్తికి తగదన్నారు. చివరకు రేవంత్ రెడ్డి తనలోని అక్కసునంతా మరోసారి బయట పెట్టుకున్నాడని, ఆయన ముఖ్యమంత్రి పదవికి పనికి రాడని అన్నారు. కేవలం ఎన్నికలలో లబ్ది పొందేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్.
ఎన్నికలు వచ్చినపుడే సీఎంకు పథకాలు గుర్తుకు వస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ చీరలు పంచడం గురించి సీఎం మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాకపోయేసరికి బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక్కటవుతున్నయని , దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర పొగడ్తలు మున్సిపల్ ఎన్నికల్లో వారు కుమ్మక్కు అవుతున్నట్టు స్పష్టంగా సూచిస్తున్నాయని అన్నారు. సీఎం రేవంత్ తన నాన చనిపోతే స్నానానికి నీళ్లు లేవని కరెంటోళ్లకు చెప్పి అర్ధగంట మోటార్ అన్ చేసుకున్నామని అసెంబ్లీలో చెప్పింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు.
















