KTR Fired on Congress Govt : మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీ చేరికలు

hellotelugu-ktr

KTR : హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ (KTR) ప్ర‌సంగించారు. ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని ఆరోపించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. బీఎస్పీ త‌ర‌పున గ‌తంలో పోటీ చేసి భారీగా ఓట్లు పొందిన అంజిబాబు కూడా త‌మ పార్టీలోకి రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఏ ఒక్క హామీన‌న్నా అమ‌లు చేశారా అని ప్ర‌శ్నించారు. రైతు బంధును ఆగం చేసిండు. నిరుద్యోగుల‌ను మోసం చేసిండు. మ‌హిళ‌ల‌ను ముంచిండు. కాంట్రాక్టు ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం లేదు..ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డారు కేటీఆర్.

KTR Slams Congress Govt

ఇదిలా ఉండ‌గా పార్టీలో చేరిన అంజిబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా భారత రాష్ట్ర సమితి (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి)లో కీలకంగా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోసారి తెలంగాణను కాపాడు కునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కేటీఆర్‌ సమక్షంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించిన ప్రముఖ సీనియర్ ముస్లిం మైనారిటీ మహిళా నాయకురాళ్లు ముస్కాన్ భాను, షెహజాది బేగం, బుష్రా బేగం, నస్రీన్ సుల్తానా అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు . వీరితో పాటు కార్పొరేటర్ మాజీ షఫీ ఆధ్వర్యంలో రహ్మత్‌నగర్‌కి చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Also Read : Nara Lokesh Australia Important Meet : క‌లిసి సాగుదాం రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం

Exit mobile version