జార్ఖండ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను బెదిరిస్తూ వీడియో పోస్ట్ చేసినందుకు రాంచీకి చెందిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతామని బెదిరించించాడని గుర్తించారు. ఆదివారం ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురు ప్రముఖ నాయకులను చంపుతామని బెదిరించినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీకి చెందిన నాగ్రి మండల అధ్యక్షుడు రితేష్ రాజ్ మహతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాంచీ జిల్లాలోని నాగ్రి పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఫిర్యాదు ప్రకారం అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెర్ గ్రామానికి చెందిన అలీమ్ అన్సారీ సోషల్ మీడియాలో ఒక అభ్యంతర కరమైన వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన మోదీ, షా మరియు ఆదిత్యనాథ్‌ల పట్ల దూషణ పూరిత భాషను ఉపయోగించడమే కాకుండా, వారిని చంపుతానని బెదిరించారని నాగ్రి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి అభిషేక్ రాయ్ పీటీఐకి తెలిపారు. తాము నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు. అభ్యంతరకరమైన వీడియోను పోస్ట్ చేయడం ద్వారా నిందితుడు సామాజిక సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అలాగే పవిత్రమైన రాజ్యాంగ పదవులను బహిరంగంగా అవమానించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారని ఫిర్యాదుదారు పేర్కొన్నారని అన్నారు.
నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అతన్ని అరెస్టు చేస్తామని ఆ అధికారి తెలిపారు.
