రేవంత్ రెడ్డిపై భగ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకోం

hellotelugu-JggadishReddy

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా త‌ను సీఎంన‌న్న సోయి లేకుండా ఎలా ప‌డితే అలా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి, నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి జ‌వాబుదారీగా ఉండాల‌న్నారు. కానీ ఇవేవీ ప‌ట్టంచుకోకుండా సీఎం మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌న్నారు. తెలంఆణ రాష్ట్ర సాధ‌న ఊరికే కాలేద‌న్నారు. ఎంతో మంది బ‌లిదానాలు, ఆత్మ త్యాగాలు, కేసీఆర్ చేప‌ట్టిన దీక్ష కార‌ణంగా వ‌చ్చింద‌ని అన్నారు. ఇవేవీ ప‌ట్టించుకోకుండా ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిని తూల‌నాడ‌డం దారుణ‌మ‌న్నారు జ‌గ‌దీశ్ రెడ్డి.

ఇంకోసారి కేసీఆర్ పై నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌టి దాకా త‌న‌పై ఉన్న గౌర‌వంతో మౌనంగా ఉన్నామ‌ని, కానీ ఇక నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం మాన‌వ‌త్వం అనిపించుకోద‌ని అన్నారు. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే ఇక సీఎంకు గ‌ట్టిగా జ‌వాబు ఇచ్చి తీరుతామ‌ని, తాము గ‌నుక పిలుపు ఇస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు జ‌గ‌దీష్ రెడ్డి. ముందు ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం హిల్ట్ ను తీసుకు వచ్చావో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త సీఎంపై ఉంద‌న్నారు. ఇది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు రూ. 5 ల‌క్ష‌ల కోట్ల భారీ స్కాం అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Exit mobile version