హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రజలకు చెందిన ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తన కుటుంబానికి, అనుయాయులు, స్నేహితులకు దొడ్డి దారిన అప్పచెప్పేందుకు ప్లాన్ వేశాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలతో సహా జారీ చేసిన ఉత్తర్వులను, తయారు చేసిన జీఓను తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బట్ట బయలు చేశాడని దీంతో బండారం బయట పడడంతో దిక్కుతోచని స్థితిలో నానా మాటలు అంటున్నాడని మండిపడ్డారు. ప్రజలు చేతికి ఇచ్చింది సక్రమంగా పాలించమని ఇలా అడ్డగోలుగా దోచుకోవడం కాదని గుర్తించాలని అన్నారు.
తమ నాయకుడు కేసీఆర్ ఆనాడు దీక్ష చేపట్టక పోయి ఉండి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. ఇకనైనా రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం ఇలా దిగజారి పోయి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. పొద్దస్తమానం కేసీఆర్ జపం చేయక పోతే తనకు నిద్ర పట్టదన్నారు. పార్టీ పరంగా ఏమైనా అనాలని అనుకుంటే, ఒకవేళ చర్చించాలని అనుకుంటే తాను వచ్చేందుకు సిద్దమని ప్రకటించారు జగదీష్ రెడ్డి.
