హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తను ఏ పార్టీకి చెందిన వ్యక్తో తనకే తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పారని , కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయితేనే నిజంగా ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని అన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా సింగరేణి టెండర్లు వేయడానికి సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే విధానాన్ని తెచ్చిందన్నారు. అంటే టెండర్ వేయాలంటే తప్పకుండా సైట్ విసిట్ సర్టిఫికెట్ అవసరం అన్నమాట. దీంతో టెండర్లు ఆన్‌లైన్‌లో వేయకుండా కాంట్రాక్టర్లు సైట్‌కు వెళ్లి చూసి సింగరేణి నుండి ఈ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందన్నారు.
ఇలా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ముందే తెలుసుకున్నాడని ఆరోపించారు హరీశ్ రావు.. తర్వాత వారిని భయబ్రాంతులకు గురిచేసి టెండర్లు రద్దు చేసుకోవాలని, లేదా తమకు అనుకూలంగా వేయాలని బెదిరిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్‌లో రేవంత్ రెడ్డి సన్నిహితుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రూ.8 కోట్లు కావాలని కాంట్రాక్టర్‌ను బెదిరించాడని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ మండిపడ్డారు. సినిమాలకు ప్రివ్యూ షోలు, రేట్ల పెంచే దాంట్లో రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వాటాల పంచాయితీ నడుస్తోందన్నారు.

















