Harish Rao : హైదరాబాద్ : తాము పవర్ లోకి వస్తే 2 లక్షల జాబ్స్ ఇస్తామని పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao). శుక్రవారం నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ఎన్నికల ముందు వేడుకున్నడు, వాడుకున్నడు. అధికారంలోకి వచ్చాక వదిలేశాడని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో అశోక్‌నగర్, సరూర్‌నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారని చివరకు దగా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పారని అన్నారు.
Harish Rao Slams Congress Govt
నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డీ పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్‌నగర్, చిక్కడ్‌పల్లి లైబ్రరీకి రావాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీశ్ రావు. బట్టలూడదీసి ఊడ గొట్టడం ఖాయమన్నారు.. నీ అసలు రంగు బయట పడ్డదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. జాబ్ క్యాలెండర్ అని జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేశారంటూ ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్‌లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్ రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడి పోయిందన్నారు.
Also Read : MP Gurumurthy Shocking Comments : రౌడీయిజానికి వేదికగా మారిన కౌన్సిల్ సమావేశం
