అమరావతి : అమరావతిలో శివరాత్రి సందడి నెలకొంది. ఒకే రంగు దుస్తుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలిశారు మహిళా ప్రజా ప్రతినిధులు. అమరావతిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల వేళ శాసనసభలో ఆధ్యాత్మిక, ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కూటమి ప్రభుత్వ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకే రకమైన వస్త్రధారణతో విచ్చేశారు. అందరి దృష్టిని ఆకర్షించారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో పాటు ఇతర మహిళా ప్రజాప్రతినిధులు అందరూ శివతత్వానికి ప్రతీకగా ఉన్న చీరలను ధరించి సభకు హాజరయ్యారు.
అనంతరం వీరంతా కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇదిలా ఉండగా మహిళా శక్తికి, ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన ఈ డ్రెస్ కోడ్‌ను మహిళా ప్రతినిధుల ఉత్సాహాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. ముందస్తు శివరాత్రి వేడుకల్లో భాగంగా శాసనసభ లాబీలో ఈ సందడి కనిపించింది. సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది . ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి , ఎస్. సవిత తో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
